Tuesday, 26 May 2026 11:23:32 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య.

Date : 21 May 2026 06:35 PM Views : 77

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.నో వర్క్- నో పెనాల్టీ సర్క్యులర్ అమలు చేయాలి. నాణ్యమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య.సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఏప్రిల్ 1 నుండి అమలు కావాల్సిన పెరిగిన డిఏ, ఈఎస్ఐ సర్క్యులర్లను యాజమాన్యం తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ లోని సివిల్ డిపార్ట్మెంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాదిమంది కార్మికుల సమస్యలను నెలల తరబడి పెండింగ్ పెట్టడం సరికాదన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య విజ్ఞప్తి మేరకు సీఅండ్ఎండి అంగీకరించిన ఫిబ్రవరి 12 నాటి నో వర్క్- నో పెనాల్టీ సర్క్యులర్ ను త్వరగా ఇవ్వాలన్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఎండల నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులు రోడ్లమీద మండుటెండలో పనులు చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మధ్యాహ్నం వేళల్లో పనులు చేయించవద్దని, వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఓఆర్ఎస్ ప్యాకెట్లలో నాణ్యత లోపించిందని, యాజమాన్యం స్పందించి నాణ్యమైన ప్యాకెట్లను సరఫరా చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.​ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్ భాస్కర్, సునీల్, సంపత్, గణేష్, మహేందర్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :