తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 1(తెలుగు వెలుగు)కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ క్రాప్ సర్వేను, క్లస్టర్ లోని ఒక AEO 5-8 గ్రామాలు, 6000-10000ఎకరాలు చేయటం కష్టతరమైనది కావున ఇట్టి DCS సర్వే కొరకు గ్రామ స్థాయిలో సహాయకులు నియమించాలని, దాని కొరకు కేంద్రం ఆర్ధిక సాయాన్ని కూడా అందిస్తుంది కాబట్టి, అట్టి బడ్జెట్ తో ప్రతి గ్రామానికి ఒక సహాయకుడిని నియమించడానికి వీలుపడుతుంది కాబట్టి, ప్రతి గ్రామానికి సహాయకుడిని నియమించాలని రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు గారికి సమస్యలు విన్నవించినా, ఇంకా పరిష్కారం చూపకుండా,AEO లపై DCS సర్వే కొరకు ఒత్తిడి తీసుకవస్తున్నందుకు నిరసనగా రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల ఐకాస పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి జిల్లా, జూలూరూ పాడు మండలం లోని AEO లు నల్ల బ్యాడ్జి లు ధరించి విధులకు హాజరవడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ