తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. (ఆటో డ్రైవర్ వెంకట రమణయ్య కుమార్తె) ఆటో డ్రైవర్ కూతురు అద్భుత విజయం.ఇంటర్ లో 973 మార్కులతో ఓంకారిణి టాప్. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ఎలాంటి పరిస్థితులైనా విజయాన్ని అడ్డుకోలేవని మరోసారి నిరూపించింది బోళ్ల ఓంకారిణి. అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆమె 973 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న బోళ్ల వెంకట రమణయ్య కుమార్తె అయిన ఓంకారిణి, చదువుపై దృష్టి పెట్టి ఈ ఘనత సాధించింది. రోజువారీ కష్టాలను తట్టుకుని, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో ఆమె ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓంకారిణి విజయంపై కళాశాల అధ్యాపకులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓంకారిణి మాట్లాడుతూ, కష్టపడి చదివితే ఎవరైనా మంచి ఫలితాలు సాధించవచ్చని, తాను ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి స్థాయిలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపింది.
Admin
తెలుగు వెలుగు టీవీ