తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో పద్మశాలీలు భారీ ర్యాలీగా పటాకులు కాల్చుతూ డీజే సౌండ్ సిస్టమ్ తో ఇంటిల్లిపాది తోటకు పయనం.. మండలపరిధిలోని కాకర్ల గ్రామంలో శ్రీసంతాన వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలోని పాలగుట్ట వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అంతా ఒకేచోట చేరి ఆనందోత్సాహాల నడుమ ఆహ్లాద భరిత వాతావరణంలో వనసమారాధన కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు.రోజంతా ఒకే చోట ఉండటంతో ఒకరి కొకరు యోగక్షేమాలను తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు..ముందుగా కాకర్ల గ్రామంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్దకు ఉదయాన్నే చేరుకొని అక్కడ నుండి పాలగుట్ట వరకు టపాసులు కాల్చుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు తుమ్మ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ..పద్మశాలీ కులబంధువులంతా ఐకమత్యంతో ఉండి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అన్నారు.ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కులస్తులంతా ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు కుల బాంధవులు ఐక్యంగా ఉండి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు సోబ్బని సూర్యం, గ్రామ అధ్యక్షులు సోబ్బని శ్రీను, పడమటి నర్సాపురం గ్రామ అధ్యక్షులు పెంటి శ్రీను, సీనియర్ జర్నలిస్ట్ గుండా సత్యనారాయణ, మహిళా సంఘం నాయకురాలు తుమ్మ విజయలక్ష్మి ,పద్మశాలి సంఘం నాయకులు కొండె వెంకటేశ్వర్లు, కొక్కుల సూరయ్య, కొక్కుల సంతోష్, కొండె రమేష్, సోబ్బని లాలయ్య, పోలూరి అప్పయ్య, పోలూరి మురళి, కొండె శ్రీనివాస్, దాసరి నాగయ్య, పోలూరి వెంకటప్పయ్య, కొండే సాయి, రాయల రమేష్ తో పాటు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ