Thursday, 25 June 2026 08:07:16 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలలో పరిశుభ్రత, నిర్వహణలో నిర్లక్ష్యం సహించేది లేదు - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 24 June 2026 05:03 PM Views : 15

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 24 గంటల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత చర్యలు చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్ అశ్వాపురం మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృతంగా పర్యటించి పాఠశాలలు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, పాఠశాల ఆవరణను పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో కంప్యూటర్లు దుమ్ము, ధూళితో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం పాఠశాల సందర్శన సందర్భంగా ఇదే అంశంపై సూచనలు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయమై సంబంధిత సీటీవోతో ఫోన్‌లో మాట్లాడి కంప్యూటర్ ఇన్‌స్పెక్టర్ కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుని గది, వంటశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించటానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి,ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని గుర్తించి హాస్టల్ వార్డెన్‌ను వివరణ కోరారు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహాలను తనిఖీ చేసిన సందర్భంగా అక్కడ కూడా పరిశుభ్రత లోపాలను గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుని గది మినహా పాఠశాలలోని మిగతా అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించిందని అసహనం వ్యక్తం చేశారు . పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల తదితర ప్రాంతాల్లో 24 గంటల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత లోపాలు, మెనూ అమలులో నిర్లక్ష్యంపై హాస్టల్ వార్డెన్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. కొత్తూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, మధ్యాహ్న భోజన నాణ్యత, మెనూ అమలుపై వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల పాఠశాలలో చేరిన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకుని, హాజరు నమోదును యాప్ ద్వారా పరిశీలించారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ సక్రమంగా నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు . అనంతరం అశ్వాపురం మండలం ఎలకలగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి చేపడుతున్న సర్వే విధానం, దరఖాస్తుల పరిశీలన, యాప్ ద్వారా వివరాల నమోదు తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వివరాలను నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి సర్వే నిర్వహించాలని, అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబం కూడా సర్వేకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. యాప్‌లో నమోదు చేసే వివరాలు ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నమోదైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ధృవీకరించాలని సూచించారు. సర్వే పురోగతిని ఎంపీడీవో జిల్లా కలెక్టర్‌కు వివరించారు. అశ్వాపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 3,448 దరఖాస్తులు ఎల్-1 స్థాయిలో ఉన్నాయని, వాటిలో 2,075 దరఖాస్తుల సర్వే పూర్తయిందని తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 409 గుడిసెలను గుర్తించినట్లు వివరించారు. మిగిలిన దరఖాస్తుల సర్వేను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అశ్వాపురం ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: