తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండా వద్ద ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి సింగరేణి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు క్షతగాత్రలను 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ