తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించాలి అని, సంఘం తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని డిఆర్డివో విద్యా చందన అన్నారు. జిల్లాలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో సీనియర్ CRP స్ట్రాటజీ కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామ సంఘాలు (VOs) మరియు మండల సమాఖ్యలు (MS) పనితీరును సమీక్షించేందుకు మొత్తం 10 మంది సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (CRPs) గత 15 రోజులుగా విస్తృత పర్యటన చేపట్టారు.గత నెల 28వ తేదీ నుండి ఈ నెల 11వ తేదీ వరకు నిర్వహించిన పర్యటన అనంతరం బుధవారం ఐడి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ (DRDO, DRDA) ఎం. విద్యా చందన పాల్గొని CRPలు సమర్పించిన నివేదికలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — “గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు తీసుకున్న బాధ్యతలను కట్టుబాట్లతో పాటిస్తూ, తీసుకున్న రుణాలను సమయానికి తిరిగి చెల్లించాలి. పుస్తక నిర్వహణను క్రమబద్ధంగా కొనసాగిస్తూ సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించాలి. ఎక్కడా కూడా నిధుల దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలి” అని సూచించారు. సంఘ సభ్యులు శిక్షణా కార్యక్రమాల ద్వారా అవగాహన పెంపొందించుకొని స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలని, సీనియర్ CRPలు తగిన మార్గదర్శకతతో గ్రామ స్థాయిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేలా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డి ఆర్ డి ఓ నీలేష్, జిల్లా సమాఖ్య అధ్యక్షులు సుజాత , డిపిఎం సి.హెచ్. అనూరాధ , సీనియర్ CRPలు, అన్ని మండలాల APMలు, VO అధ్యక్షులు, CCలు, VOAలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ