తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : నకిలీ విత్తనాలను అమ్మితే చర్యలు తప్పవని టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ బుధవారం హెచ్చరించారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించాలని దుకాణదారులకు సూచించారు. రైతులకు విక్రయాల రశీదులు కచ్చితంగా ఇవ్వాలన్నారు. నకిలీ విక్రయాలపై నిఘా పెట్టమని, తనిఖీలు చేసి పట్టుపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యం ఉంచుతామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ