తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ జిల్లాలోని జగన్నాధపురం, ఎంపీ బంజర మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆశా డే సందర్భంగా తనిఖీ చేయడం జరిగినది . జగన్నాధపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గ్రామ ప్రజలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిల్డింగ్ శాశ్వత నిర్మాణం గురించి మాట్లాడడం జరిగినది.ఆషాడే సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గర్భిణీ స్త్రీల రిజిస్ట్రేషన్ నమోదు మరియు ప్రభుత్వఆసుపత్రి లో కాన్పులు జరిపించాలని, సిజేరియన్లకు తావివ్వకూడాదు. గర్భిణీలను నమోదు చేసినప్పటి నుంచి కాన్పు అయ్యేంతవరకు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి ,ప్రత్యేకంగా గుత్తి కోయ హ్యాబిటేషన్లలో ఈ కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టాలి .రికార్డులు సక్రమంగా నిర్వహించాలి . ఎం సి హెచ్ కార్డులు అర్హులందరికీ అందజేయాలని రక్తహీనత రాకుండా వారికి ఐరన్ మాత్రలు ఎప్పటికప్పుడు ఇస్తూ అవసరమైన వారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లి వారికి రక్తం ఎక్కించాలని తెలియజేశారు అదే విధంగా గర్భిణీ స్త్రీలకు తల్లులకు విహెచ్ఎన్ డి నిర్వహించినప్పుడు వారికి తల్లిపాల ప్రాముఖ్యత మరియు వ్యాధి నిరోధక టీకాలు వ్యక్తిగత శుభ్రత చేతుల శుభ్రత గురించి కుటుంబ నియంత్రణ గురించి కచ్చితంగా తెలియజేయాలని సూచించారు జిల్లాలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతున్న లెప్రసీ నిర్మూలన కార్యక్రమంలో విజయవంతం చేయాలని మరియు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంను కూడాపటిష్టంగా నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదని కాలేజీలలో మరియు పాఠశాలలలో సమావేశాలను నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని , ఆశలకు మరియు ఏఎన్ఎం లకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆశాడే నందు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సూపర్వైజర్లు ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ