తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ అఫ్ పోలీస్(డీజీపీ)గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డిని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.శుక్రవారం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందించి శాలువా తో సన్మానించారు..అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్రానికి సమర్ధవంతమైన అధికారిగా అయన ఆధ్వర్యంలో శాంతి భద్రతలు అద్భుతమైన పురోగతి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.సాధారణ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి రాష్ట్ర అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శ ప్రాయమని ప్రశంసించారు
Admin
తెలుగు వెలుగు టీవీ