Friday, 19 June 2026 02:58:53 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : Dr తుకారాం రాథోడ్ DMHO

Date : 16 June 2026 04:35 PM Views : 26

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వైద్యాధికారులు మరియు ఎం ఎల్ హెచ్ పి లతోసమీక్ష సమావేశం లో Dr తుకారాం రాథోడ్ DMHO ఆరోగ్య సేవల నాణ్యత పెంపు, మాతా-శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు మరియు వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – డా. తుకారాం రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ అధ్యక్షతన వైద్య అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ప్రతి వైద్య అధికారి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల ఆరోగ్య సూచికలను మెరుగుపరచేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో క్రింది అంశాలపై సమీక్ష నిర్వహించారు: గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన గర్భధారణ పూర్వ సేవలు అందించాలి. అధిక ప్రమాద గర్భిణీలను (High Risk ANC) గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయాలి. సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మాతృ మరణాలు (MMR) మరియు శిశు మరణాలు (IMR) తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలి. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి జననం తర్వాత వెంటనే తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించాలి. రక్తహీనత (Anemia) నివారణకు చర్యలు చేపట్టాలి. సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. జీవనశైలి వ్యాధులు అయిన మధుమేహం, రక్తపోటు, ఊబకాయం నియంత్రణకు స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలి. క్షయవ్యాధి (TB), కుష్ఠు వ్యాధి, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించి దోమల నివారణ చర్యలను కట్టుదిట్టం చేయాలి. యాంటీ లార్వల్ ఆపరేషన్లు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. HPV టీకా, పల్స్ పోలియో, స్టాప్ డయేరియా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి. సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, యోగా వంటి ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించాలి. ఆరోగ్య కేంద్రాల్లో రికార్డులు, రిజిస్టర్లు మరియు నివేదికలను సక్రమంగా నిర్వహించాలి. ప్రజలకు ఆరోగ్య విద్య అందించేందుకు IEC, BCC కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అన్ని ఆరోగ్య కేంద్రాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా, వైద్య అధికారులు తమ పరిధిలోని గ్రామాలను తరచుగా సందర్శించి ఆరోగ్య కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి సిబ్బంది తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో భర్తీపై ప్రణాళికను తయారు చేయుట కొరకు గతంలో జనరల్ ట్రాన్స్ఫర్లలో సబ్ సెంటర్లు ఇవ్వని 54 మంది ఏఎన్ఎంలకు ఈనెల 18వ తారీకున కమిషనర్ గారి ఆదేశానుసారం డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీస్, కొత్తగూడెం నందు కౌన్సిలింగ్ నిర్వహించబడును అని తెలియజేశారు ఈ సమావేశంలో Dr శ్రీధర్ Dy DMHO Dr సాయి కళ్యాణ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ, Dr ప్రసాద్ ప్రోగ్రాం ఆఫీసర్లు Dr ప్రతాప్ , Dr రాందాస్ , Dr రాకేష్ , Dr దినేష్ dr. హరీష్, వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పీ లు మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: