తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆదివారం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని సింగరేణి హై స్కూల్ ప్రాంగణంలో జరిగే మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంత యువత పాల్గొని విరివిగా రక్తదానాన్ని చేయాలని రక్తాన్ని కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ లో బ్లడ్ బ్యాంకులో నిల్వ ఉంచడం జరుగుతుందని అత్యవసర సమయాల్లో డాక్టర్లు వినియోగించుకుంటారని తెలిపారు.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే నిరుపేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు బాలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ