తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా జిల్లా ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలి. జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలు నందు అధికారులతో సమావేశమయ్యారు.ముందుగా విధులు నందు ఉత్తమ ప్రతిభను కనబరిచి రివార్డులను అందుకున్న పోలీస్ అధికారులను,సిబ్బందిని అభినందించారు.అదే విధంగా పలు కేసులలో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు.అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.పోక్సో కేసులలోని నిందితులకు త్వరతగతిన శిక్ష పడే విధంగా కృషిచేయాలని సూచించారు.గంజాయి అక్రమ రవాణా,మట్కా,క్రికెట్ బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు.వేసవి కాలం సెలవుల దృష్ట్యా దొంగతనాలు జరగకుండా గస్తిని పెంచి పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.షీ టీమ్స్,భరోసా కేంద్రాల ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భాధిత మహిళలకు అండగా ఉండాలని ట్వలిపారు.ఈ సమావేశంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ అశోక్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసిఆర్బీ సీఐ సర్వయ్య , సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాము, ఏవో మంజ్యా నాయక్ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ