తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్ఫేస్ ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్ కౌన్సిలింగ్ లో సీనియర్స్ కి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి కొత్తగూడెం ఏరియా లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో జిఎం కి మెమొరాండం ఇవ్వడం జరిగింది,అనంతరం ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావు మాట్లాడుతూ కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు, ఈ నెల జరిగిన సర్ఫేస్ ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్ కౌన్సిలింగ్ లో అవకతవకలు జరిగాయని, జూనియర్ టెక్నీషియన్స్ ను సత్తుపల్లి కి పంపి అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్ టెక్నీషియన్స్ ను ఏరియాలోని డిపార్ట్మెంట్స్ లో సర్దుబాటు చెయ్యాలి అని డిమాండ్ చేశారు, జరిగిన కౌన్సిలింగ్ నీ రద్దుచేసి మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించి సీనియారిటీ ప్రకారం బదిలిచేసి సీనియర్ కార్మికులకు న్యాయం చెయ్యాలనీ కోరారు, అదేవిధంగా వికె కోల్ మైన్ లో పంప్ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేయాలిని, పంప్ ఆపరేటర్ యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు అర్హతను,యాక్టింగ్ మాస్టర్స్ బట్టి వారికి ప్రమోషన్ ఇవ్వాలని కోరారు,ఈ కార్యక్రమం లో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి,సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,ఎస్ నాగేశ్వరరావు, హీరాలాల్, పిట్ కార్యదర్శిలు హుమాయూన్, ఏం ఆర్ కే ప్రసాద్, సీనియర్ నాయకులు బండారి మల్లయ్య, బండి వెంకటరమణ, ప్రభాకర్,రమేష్,తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ