తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 20న మంగళవారం జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ములకలపల్లి మండలం మంగపేట గ్రామంలో పబ్లిక్ హెల్త్ సెంటర్ ను, అశ్వారావుపేట మండలం నారాయణపురం, వినాయకపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ