తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అణగారిన వర్గాలకు అక్షర జ్యోతిలా మారిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.శనివారం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పూలే 199వ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సంధర్భంగా కామేష్ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ది జరుగుతుందని ఫూలే భావించారని,అక్షరాలను ఆయుధంగా చేసుకుని అణగారిన వర్గాల విద్యాభివృదికి కృషి చేశారని,సమసమాజ స్థాపన కోసం పూలే చేసిన పోరాటాలు చూపిన కార్యదీక్షత ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు.ఫూలే సంఘ సంస్కరణలు తీసుకువచ్చే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.తనతో పాటు తన సహచరురాలు సావిత్రిభాయి ఫూలేకు విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధ్యాయురాలిని చేశారని,ఫూలే దంపతులు 54 విద్యాలయాలు నిర్మించారని కొనియాడారు.మహిళల హక్కులు,విద్యా బోధన,సతీ సహగమనికి వ్యతిరేకంగా పోరాడి,స్త్రీలకు పునర్వివాహలు జరిపించారన్నారు.నేటి యువత అయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, కొండా విజయ్ భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ