తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారుల కార్యాలయం నవభారత్ పాల్వంచ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గుడిపాడు,అశ్వాపురం మరియు మణుగూరు ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఆరోగ్య సిబ్బంది అందరు సమయ పాలన పాటించాలని,అందరు తమ తమ ఉపకేంద్రాలందు దగ్గర్లో అందుబాటులో ఉండాలని లేనియడల శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కుష్ఠు వ్యాధిగ్రాస్తుల గుర్తింపు ఉద్యమంను ఆశ కార్యకర్తలు చేస్తున్న సర్వే ను పరిశీలించిన తరువాత ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలందు జరిగిన శ్రమదాన కార్యక్రమం నందు సిబ్బందితో పాల్గొని వాటి పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ శ్రమదానం కార్యక్రమం నందు పాల్గొన్న సిబ్బంది అందరు తమ అందాన్ని సంతోషాన్ని వ్యక్తపరిచారు .ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా మన కేంద్రాన్ని మనమే శుభ్రం చేసుకున్నామని ,అందరం తారతమ్యాలు మరిచి ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు తీసుకోని వెళ్లుతామని సిబ్బంది అందరు హార్షం వ్యక్తపరచారు
Admin
తెలుగు వెలుగు టీవీ