తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మంగళవారం ఈవీఎం గోడౌన్ ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించరాదని అధికారులకు సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లు సంతకం చేశారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, పొలిటికల్ పార్టీ నోముల రమేష్ బిజెపి, లక్ష్మణ అగర్వాల్ కాంగ్రెస్ పార్టీ, హమ్ ఆప్ ది పార్టీ రాంబాబు, సిపిఐ పార్టీ ఎస్ శ్రీనివాస్, సిపిఐఎం ఎస్కే సలీం ఎన్నికల సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ