తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు సంబందించి నిరూపయోగంగా ఉన్న వస్తువులను ది.26.06.2025 (గురువారం) నాడు ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు బహిరంగ వేలం పాట ద్వారా విక్రయించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ వేలంపాటలో కంప్యూటర్ మానిటర్లు, CPU లు, కీబోర్డులు,మౌస్లు,UPS లు , ట్యాబ్ లు,యాపిల్ ఐ ప్యాడ్ లు, ఇన్వర్టర్ మరియు ఇన్వర్టర్ బ్యాటరీలు, డ్రాగన్ లైట్లు,టార్చ్ లైట్లు, క్లోత్ టెంట్లు,టేబుళ్లు, కుర్చీలు,బీరువాలతో పాటు ఇతర ఫర్నీచర్ సామాగ్రిని మరియు ఇతర వస్తువులకు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇట్టి వేలంపాట నందు ఆసక్తి గల వ్యక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఆర్ఎఐ అడ్మిన్ షేక్ లాల్ బాబు గారిని (8712682143) సంప్రదించగలరని తెలియజేసారు.
Admin
తెలుగు వెలుగు టీవీ