తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం జులై 21 ( తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండల ఎంపీవో తులసి రామ్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న కారణంగా ఇళ్లలో నీరు నిలవలు లేకుండా చేసుకోవాలని నీరు నిల్వ ఉండడం వలన దోమలు,ఈగలు అధికంగా వృద్ధి చెంది మలేరియా,డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మండలంలోని గ్రామాల ప్రజలు ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడడమే కాకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంటిలో వారంలో ఒకరోజు డ్రై డే గా ఉంచుకోవాలని, వేడిగా ఉండే ఆహార పదార్థాలు తింటూ గోరువెచ్చని నీరు తాగడం మంచిదని ఆయన ప్రజలకు సూచించారు. ఇప్పటికే పంచాయితీ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేశామని అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ వారు నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ