Tuesday, 26 May 2026 11:25:39 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Date : 02 May 2026 06:10 PM Views : 223

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ముందుగా దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన, సమగ్ర విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. యంగ్ ఇండియా పథకం కింద నిర్మించనున్న ఈ రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు వసతి, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆధునిక తరగతి గదులు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, హాస్టల్ వసతులతో ఈ విద్యాసంస్థ నిర్మించబడుతుందని పేర్కొన్నారు. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్ప గ్రామం నుండి బురదమడుగు వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ రహదారి పూర్తయిన తర్వాత చింతగుప్ప, బురదమడుగు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు గణనీయమైన ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. ములకపాడు గ్రామంలోని మినీ స్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్‌తో కూడిన మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామీణ యువతలో క్రీడా చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మినీ ఇండోర్ స్టేడియంలో కల్పించిన సదుపాయాలను జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టులో మంత్రి, కలెక్టర్ కలిసి షటిల్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రతి అర్హులైన కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు గృహ సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని, మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, రెండో విడతను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహిస్తూ వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లే దిశగా రహదారులు, విద్య, ఆరోగ్యం, క్రీడా రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశల వారీగా అందిస్తూ సమగ్ర అభివృద్ధి సాధనలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని తెలిపారు. యంగ్ ఇండియా పాఠశాల, రహదారి, క్రీడా వసతుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవాణా, క్రీడా రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నిజంగా పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం ద్వారా జిల్లాలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఈ పాఠశాలలో సుమారు 2,000 నుండి 2,500 మంది విద్యార్థులు ఒకేచోట విద్యనభ్యసించే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతోందని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో ఎస్‌పి రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :