తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్(క్యాబినెట్ హోదా ), ఉమ్మడి రాష్ట్ర ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ ఆదివారం పాల్వంచ మండలంకేశవాపురం-జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఈవో రజనీకుమారి వారి సిబ్బందితో కలసి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.అర్చన, పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.అమ్మ వారి ప్రసాదం అందించారు. అమ్మ వారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సురేందర్ తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.ఆయన వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పామర్తి అంకినీడు ప్రసాద్ గౌడ్,ఉపాధ్యక్షులు మాదా శ్రీరాములు, జిల్లా జనరల్ సెక్రటరి మహేష్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కౌడగాని శ్రీనివాస్ యాదవ్, గాజుల శ్రీనివాస్, కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు మహంకాళి భిక్షపతి, బీసి సంఘం రాష్ట్ర నాయకులు సమ్మెట అప్పారావు, ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శనగ రామచందర రావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ