తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎంపీ తేజస్వి సూర్య అవమానపరిచారు నేటి పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మండిపడ్డారు. వందలాది మంది అమరవీరుల ఆత్మ బలిదానాలు, తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వాన అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని స్పష్టం చేశారు. గొప్ప చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర విభజనను భారత్ విభజనతో పోల్చడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత పార్లమెంట్లో కనీస అవగాహన లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అపహస్యం చేసేలా మాట్లాడిన ఎంపీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ