Monday, 20 April 2026 01:51:27 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ప్రభుత్వ పాఠశాల కళాశాలలు సంపూర్ణ బంద్ పాటించాయి AISF SFI PDSU PDSU PDSU ఆధ్వర్యంలో

Date : 23 July 2025 07:42 PM Views : 1266

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మసక బారుతున్న ప్రభుత్వ విద్యను కాపాడాలి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను ఆధునికరించాలి. కనీస మౌలిక సదుపాయలపై ప్రభుత్వం దృష్టి సారించాలి.యుద్ధ ప్రాతిపదన ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి.పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలి.నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి.కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి .విద్యార్థులు బడిబాట పట్టాలంటే సమస్యలే పరిష్కారమే మార్గంకొత్తగూడెం : ప్రభుత్వ విద్య మసకబారుతుందని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని,ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు నేడు వెలవెలబోతున్నాయని, విద్యార్థులు బడిబాట పట్టాలంటే సమస్యల పరిష్కారమే మార్గమని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బయ్యా అభి మన్యు పిడిఎస్యు జిల్లా కార్యదర్శి గణేష్ పిడిఎస్యు జిల్లా నరేంద్ర ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక కొత్తగూడెం బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల చేపట్టిన బంద్ లో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సంపూర్ణం. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మౌలిక వసతులు కల్పన లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయితే విద్యార్థు లు తీవ్ర ఇబ్బందులుకు గురికావాల్సి వస్తుందని, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులలో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఉపాధ్యాయులపై ఉందన్నారు. గత పదేళ్లుగా ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం, ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించి, ఉపాధ్యాయ మరియు లెక్చరర్స్ నియామకాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యపై దృష్టి సారించి ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టం చేయాలని అయన అన్నారు.గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల విద్య రంగానికి ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు ప్రభుత్వం కొలువుదీరి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికి కనీసం విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అంత్యంత బాధాకరమని వారు అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం , ప్రభుత్వ విద్య రంగంపై దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలను కళాశాలను ఆధునికరించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు శిథిలావస్థకు చేరుకున్న భవనాలు స్థానంలో సొంత భవనాలు నిర్మించి గురుకుల సంక్షేమ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేశారు .రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా 8150 వేల కోట్ల పెండింగ్ బకాయలను తక్షణ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు..లేనియెడల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వారి హెచ్చరించారు ఈ బంద్ కు సహకరించిన విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులకు మేధావులకు ప్రజాతంత్ర వాదులకు ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ నాయకులు గుండాల సుజన్ సంజయ్ వినయ్ ఎస్ఎఫ్ఐ నాయకులు రెస్వాత్ వినీల్ పి డి ఎస్ యు నాయకులు శ్యామ్ భార్గవ్ పాల్గొన్నారు...

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :