Wednesday, 15 April 2026 05:19:55 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

రోడ్డు భద్రతపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన – ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 13 April 2026 01:38 PM Views : 33

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సోమవారం చుంచుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 6 నుండి ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి వారం వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు డీ-అడిక్షన్ మరియు కౌన్సిలింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములుగా చేసుకుంటూ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు . రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని అన్నారు . ఈ గ్రామసభల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించడం, రహదారుల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ప్రమాదాల సమయంలో అంబులెన్స్ సేవలు సమయానికి అందుబాటులో ఉన్నాయా, సమీప ఆసుపత్రులకు కనెక్టివిటీ ఎలా ఉందనే అంశాలను కూడా ఈ గ్రామసభల ద్వారా సమీక్షిస్తున్నామని వివరించారు. పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా వారు తమ తల్లిదండ్రులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను తెలియజేసేలా చేయాలని సూచించారు. ఇది ఏ ఒక్క శాఖకు సంబంధించిన విషయం కాదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రమాద రహిత జిల్లాను సాధించగలమని అన్నారు. కొన్ని జిల్లాలో అమలు చేస్తున్న “నో హెల్మెట్ – నో ఎంట్రీ” వంటి వినూత్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, అలాంటి ఆలోచనలను మన జిల్లాలో కూడా అనుసరించాలని సూచించారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని , వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గ్రామస్థులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్పంచ్ భూక్య శాంతి శ్రీ, తాసిల్దార్ నాగరాజు, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, రవాణా, పోలీస్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :