తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మండలంలోని రాచన్నగూడెం గ్రామంలో సుమారు 26 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబడనున్న సీసీ రోడ్లు స్వయం సహాయక సంఘాల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం మూకమామిడి గ్రామపంచాయతీకి నూతనంగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు అదేవిధంగా ములకలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, కారం సుధీర్, సర్పంచులు మడకం విజయ , కల్లూరి కిషోర్, కోర్స ఆదిలక్ష్మి , ఎమ్మార్వో భాగ్యలక్ష్మి , ఎంపీడీవో రామారావు, ఎంపీఓ రమేష్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వరప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ