తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తండ్రిని అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. పడిగేరు ఎస్టీ కాలనీకి చెందిన కోసర బుచ్చయ్య (80)ను కొడుకు సత్యనారాయణ మద్యం మత్తులో కత్తితో నరికి హత్య చేశాడని తల్లి లక్ష్మి తెలిపింది. సమాచారం అందుకున్న సీఐ సతీష్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ