తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సామాన్య జనం ఆసరా లబ్ధిదారులు,పేద రైతులు బ్యాంకులో తీసుకున్న వ్యక్తిగత లోన్ల రికవరీలో వారికి వచ్చే ఆసరా పింఛన్లు రికవరీ కోసం ఆపవద్దని సిపిఐ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ హేమంత్ కుమార్ కి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం పేదవారికి, కూలీలకి వారి జీవన అవసరాలకు ఆసరా కలగాలని ఉద్దేశంతో ప్రభుత్వం సామాజిక ఆసరా పెన్షన్లు అందించిందని ఈ సందర్భంగా మేనేజర్ వివరించారు. వృద్ధాప్యంలో వాళ్ళు బిపి, షుగర్ గోలీలు తదితర మందులు తెచ్చుకునేందుకు వారి జీవనవసరాలు కొంతమేరకు తీర్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ తోనే వారి జీవనం వెల్లదీస్తున్నారని అలాంటి పేదల ఆసరా పెన్షన్ ఆపటం సరైనది కాదని బ్యాంకు మేనేజర్ కి వివరించడంతో దీనిపై స్పందించిన బ్యాంక్ మేనేజర్ వారి లోన్లు చెల్లింపునకు గడువు తో కూడిన హామీ పత్రం తీసుకొని వారి పెన్షన్లను వెంటనే రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చారని సిపిఐ ప్రతినిధి బృందం తెలిపారు. వినతి పత్రం అందించిన వాటిలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచర్ల జమలయ్య, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్య శ్రీనివాస్, నాయకులు సక్రం, లచ్చిరాం, గోబ్రియ, జోజియా, చిలకమ్మ, సామిని ,లక్ష్మి ,వంశీ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ