తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 14 (తెలుగు వెలుగు) : CEIR పోర్టల్ ద్వారా భాధితుల మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ప్రశంసించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న భాదితులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలియజేసారు.జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో CEIR పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడం జరిగితుందన్నారు.గత రెండు నెలల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 150 మంది భాధితులకు ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో తిరిగి వారి ఫోన్లను అప్పగించడం జరిగింది.మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టడం జరుగుతుందని తెలియజేశారు. కావున ఎవరైనా తమ మొబైల్ దొంగిలించబడినా,పోగొట్టుకున్నా వెంటనే CEIR పోర్టల్ ద్వారా తిరిగి వారి మొబైల్ ఫోన్లను పొందవచ్చునని తెలిపారు. గడిచిన ఐదు నెలల కాలంలో మొత్తం 743 మొబైల్ ఫోన్లను కనిపెట్టి భాదితులకు అందజేయడం జరిగిందని తెలియజేసారు.పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్ వివరాలను పొందుపరిచి ఫిర్యాదు చేయగలిగితే అట్టి ఫోన్లను సులభంగా కనిపెట్టవచ్చని ఈ సందర్బంగా ఎస్పీ గారు తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను అవతల వ్యక్తి వినియోగించాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే అట్టి మొబైల్ ను ట్రేస్ చేయగలమని అన్నారు.ఈ సందర్భంగా బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటి సెల్ ఇంచార్జి సీఐ రాము, ఎస్సై సురేష్ మరియు ఐటి సెల్ సభ్యులు నవీన్, నరేష్, మహేష్, నరేన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ