Sunday, 19 April 2026 02:10:21 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 23 September 2025 05:51 PM Views : 222

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచార వ్యూహాలు తదితర అంశాలపై చర్చ జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. జిల్లాలోని విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో వైద్యాధికారుల సహకారంతో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి, అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని, డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా అవసరమైన చికిత్స అందించాలని తెలిపారు.అటవీశాఖ అధికారులు, వారి పరిధిలోని అటవీ భూములను పరిశీలించి, గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే, ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు సూచనలు జారీ చేయడం జరిగింది.ఇంటర్ కళాశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగ వల్ల కలిగే నష్టాలపై ఈ వారం లో ప్రణాళికలు రూపొందించాలని, యువత, విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అని అన్నారు. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటదశలోనే కట్టడి చేయాలని, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లు, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.అదనంగా, యువతలో రక్తదానం అవగాహన కల్పించి రక్తదాన శిబిరాలు, అనిమీయ పరీక్షలు నిర్వహించమని, నర్సింగ్, NCC శిక్షణ ద్వారా యువతకు మార్గనిర్దేశం చేయాలని, మాదకద్రవ్య నియంత్రణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర పరికరాలు సమకూర్చేందుకు అవసరమైన నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇల్లందు డిఎస్పి చంద్రబాను, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, ఇంటర్మీడియట్ అధికారి వేంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి జయలక్ష్మి, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :