Sunday, 21 June 2026 02:43:48 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

భద్రాచలం వద్ద గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 31 August 2025 10:02 AM Views : 1258

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ, ఈ రోజు ఉదయం 9 గంటలకు 48.00 అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు. ప్రస్తుతం నదీ ప్రవాహం ద్వారా 11,44,645 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నదని ఆయన తెలిపారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుందని పేర్కొన్న కలెక్టర్, ముంపు ముప్పు ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రజల కోసం తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలను ఆదేశించారు. vకలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరిలోకి దిగి స్నానం చేయరాదని, పడవ ప్రయాణాలు పూర్తిగా నిషేధించబడినట్లు స్పష్టం చేశారు. వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు సులభంగా సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు క్రింది నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు: సబ్ కలెక్టర్ కార్యాలయం, భద్రాచలం – 08743-232444 వరదల కంట్రోల్ రూమ్ – 7981219425 జిల్లా కలెక్టర్ కార్యాలయం, పాల్వంచ – 08744-241950 ఐటీడీఏ కార్యాలయం, భద్రాచలం – 7995268352 ప్రజలందరూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కలెక్టర్ కోరారు. జిల్లా యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తూ, ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: