తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు అనగా 23-03-2026న జిల్లా కార్యాలయం నందు ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు డి.సి.హెచ్.ఎస్ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా నియమితులైన ప్రోగ్రామ్ ఆఫీసర్లను పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 27-03-2026న జరగనున్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. పండుగ సందర్భంగా ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కేంద్రాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన సూచనలు జారీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దుకాణం రాథోడ్, డి సి హెచ్ ఎస్ రవిబాబు, జిజిహెచ్ ఆర్ ఎం ఓ డాక్టర్ సత్య చైతన్య, డాక్టర్ సాయి కళ్యాణ్, ప్రోగ్రాం ఆఫీసర్, పీవోఎం హెచ్ ఎన్ డాక్టర్ చైతన్య, డాక్టర్ రాకేష్, పి ఓ సి హెచ్ ఐ డాక్టర్ ప్రతాప్ , ఐడిఎస్పి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పుల్లారెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ ఇన్ సిడి డాక్టర్ మధువరన్, డాక్టర్ హరీష్, ప్రోగ్రాం ఆఫీసర్ పి సి పి ఎన్ డి టి,మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్పందన, డాక్టర్ రాందాస్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ