తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం వాగులోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం సమీపానలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వనంవారి కిష్టాపురానికి చెందిన బుడుగు బాబు(37) ద్విచక్రవాహనంపై చిరుమర్రి వైపు వెళ్తుండగా ప్రమాదవ శాత్తు బైక్ వాగులోకి దూసుకెళ్లింది. దీంతో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు
Admin
తెలుగు వెలుగు టీవీ