తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా ఉన్న రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జల్ సంచెయ్ జన్ భాగీ దారి కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మించడానికి చేపట్టవలసిన చర్య గురించి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రహదారి వెంట ఇంకుడు గుంతలు ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వర్షపు నీరు నేలలోకి ఇంకి భూగర్భ జల మట్టం పెరుగుతుంది, తద్వారా నీటి కొరత సమస్య పరిష్కారం అవుతుందని అలాగే రహదారులపైన నీరు నిల్వకుండా రోడ్ల పాడైపోకుండా ఉంటాయి అని అన్నారు. ఇంకుడు గుంతలు రోడ్ల పక్కన, వర్షపు నీరు నిల్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి గ్రామ, మండలం మరియు జిల్లాస్థాయిలో మార్కింగ్లు పెద్ద ఎత్తున చేయాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. మార్కింగ్ చేసిన ప్రదేశాలలో జెసిబి ద్వారా పంచాయతీరాజ్ శాఖ ఏఈ ల పర్యవేక్షణలో ఇంకుడు గుంతలను త్రవ్వాలన్నారు. అనంతరం స్థానికంగా దొరికే చిన్న రాళ్లను గుంతలో నింపాలన్నారు. రానున్న వర్షాకాలంలో చుక్క వర్షపు నీరు కూడా వృధా కాకుండా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం సరైన పద్ధతిలో చేపట్టాలని వర్షపు నీరు గుంతలోకి చేరే విధంగా మాత్రమే నిర్మాణం ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇంకుడు గుంత నిర్మాణం అనంతరం త్రవ్విన మట్టిని అలా వదిలేయడం ద్వారా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టి ఎటువంటి ఉపయోగం ఉండదని, కాబట్టి ఇంకుడు గుంత నిర్మించిన వెంటనే మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. నిర్మించిన ప్రతి ఇంకుడు గుంత ఫోటోలను జెల్ సంజయ్ జెన్ భాగి దారి పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. దేశంలోనే జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో జిల్లా రెండవ స్థానంలో ఉందని ఇంకా పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ