తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా వీకే సీఎం ఓసి లో కాపుకృష్ణ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మెమోరాండం లోని డిమాండ్స్ ని వెంటనే పరిష్కరించాలని నిరసన తెలియజేసి మేనేజర్ మురళి గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. మెమరండంలో పొందపరిసిన1) వాస్తవ లాభాలపై 35% వాటా ప్రకటించాలి 2) కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలి. Perks మీద పన్ను యాజమాన్యమే చెల్లించాలి యజమాన్యమే చెల్లించాలి _3) అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డు కు వెళ్లే కార్మికులందరికీ అన్ఫిట్ చేయాలి _ 4) జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఉత్తర్వులు ఇచ్చిన 50 మందికి తిరిగి మెడికల్ పిలిచి వారంద ని unfit చేయాలి 5) వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణి నూతన బొగ్గు గనులను కేటాయించాలి 6) సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 43 వేల కోట్ల రూపాయలను బకాయిలను ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం 7) మెడికల్, ట్రైనింగ్ అయిన డిపెండెంట్ లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి. అంశాలపై కాపుకృష్ణ మాట్లాడుతూ ఈ మెమొరండను పై యాజమాన్యం వారికి పంపి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య,సెంట్రల్ కమిటీ సభ్యులు ఈశ్వర్,బ్రాంచ్ సెక్రటరీలు అశోక్,రాజ్ కుమార్,గణేష్,సాగర్, పిట్ సెక్రటరీలు వెంకటేశ్వర్లు, శ్రీరామ్మూర్తి,రాజేశ్వరరావు, రవీందర్, ప్రభాకర్, రఫీ, హనుమంతు, శ్రీనివాస్, రాజేష్, అనుదీప్,శ్రీనివాస్, ప్రభాకర్,వెంకటరావు కార్మిక సోదరులు పాల్గొని మెమోరాండం ఇవ్వడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ