తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాడు "యాంటీ డ్రగ్ అవేర్నెస్" పోస్టర్లను జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపీఎస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పోస్టర్లు, బ్యానర్లు, యాంటీ డ్రగ్స్ సోల్జర్ సెల్ఫీ పాయింట్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 22 నుంచి 26 వరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాఠశాలలు, కళాశాలలో, పట్టణాల్లో, గ్రామాలలో మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో మార్పు వచ్చినప్పుడే డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించగలమని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన కదలికలను గమనిస్తూ ఉండాలని సూచనలు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేసిన వినియోగించిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ