తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబరు 5 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల ప్రజలకు ఎంఆర్ఓ స్వాతి బిందు మీడియా ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను బుధవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేయనున్నారు. సర్వేలో భాగంగా జూలూరుపాడు మండల వ్యాప్తంగా 73 మంది ఇన్జులేటర్స్ ప్రతి ఇంటిని సర్వే నిర్వహించనున్నారు. కావున మండల ప్రజలందరూ సర్వేకు అవసరమయ్యే రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల తో ఇంటికి వచ్చిన అధికారులతో సర్వేకు సహకరించగలరని మనవి
Admin
తెలుగు వెలుగు టీవీ