తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 30(తెలుగు వెలుగు)ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూలూరుపాడు పరిధిలోని పెద్ద హరిజనవాడ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి జ్వరము జలుబు దగ్గు వళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారిని వైద్యం చేయడం జరిగింది.వర్షాకాలం కావున సీజనల్ వ్యాధులు ప్రభులే అవకాశం ఉన్నది. మన ఇంటిలోనూ మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాల్లోనూ మురికి కాలువల్లో మురుకు నీరు నిలువకుండా మరియు పాడైపోయినటువంటి తొట్లలో వర్షపు నీరు నిలిచి లార్వాలు పెరిగి దోమలుగా మారి డెంగ్యూ వైరస్ ను మరియు మలేరియాని వ్యాపింప చెందే అవకాశం ఉన్నది.కావున పరిసరాల పరిశుభ్రతతో పాటు మురుగునీటి పారిశుధ్యం గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వెంకటేశ్వర్లు ఏmo రామకృష్ణ cho హెల్త్ అసిస్టెంట్ కృష్ణ ఏఎన్ఎం మరియు ఆశాలు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ