తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 23 (తెలుగు వెలుగు) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించాలని న్యాయమూర్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం "బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన" క్యాంపెన్ లొ భాగంగ బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి స్థానిక కొత్తగూడెంలో ఉన్న చిన్న బజార్, పెద్ద బజారులలోని కిరణం షాపు, షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలలో ఆకస్మిక తనికి నిర్వహించారు. తనిఖీలలొ భాగంగ చిన్న బజారులో ఉన్న రాయల్ కిరాణా షాపులొ బాల కార్మికుడిని గుర్తించారు. బాలుడు వివరాలను తెలుసుకొని అతడి తల్లిని పిలిపించి తప్పనిసరిగా బడిలో చేర్పించాలని ఆదేశించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే బాల కార్మిక చట్టం ప్రకారం పనిలో పెట్టుకున్న యజమాని పైన కేసును నమోదు చేయడం జరుగుతుందని కిరాణా షాప్ యజమానిని న్యాయమూర్తి హెచ్చరించారు. ఆ బాలుడిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించే బాధ్యతను యజమాని మరియు తల్లి తీసుకొని స్కూల్ లొ అడ్మిషన్ చేయించిన వివరాలను తెలియపరచాలని ఆదేశించారు. ఈ తనికిలో భాగంగ కొత్తగూడెం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహమ్మద్ షర్ఫుద్దీన్, న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ