తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సోమవారం వారి స్వగృహంలో జిల్లా న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ముధల్కర్ మరియు కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి,న్యాయవాదుల మరియు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగూడెంలో నూతన కోర్టు భవన సముదాయాల నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి త్వరలో శంకుస్థాపనతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన పనులు ప్రారంభించి,వేగవంతంగా పూర్తి చేసే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని,అదేవిధంగా జిల్లా జైలు ఏర్పాటు విషయంపై కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం పట్ల కిరణ్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు-1 షార్జాన్ పర్వీన్,ఉపాధ్యక్షులు-2 కటూరి సంజీవ రావు,ప్రధాన కార్యదర్శి గడిపల్లి మహేష్ సంయుక్త కార్యదర్శి గడదాసు నాగరాజు,కోశాధికారి సంధ్యా రాణి,క్రీడా కార్యదర్శులు బానోత్ దేవదాస్,నాకెరకంటి ఉమ,గ్రంథాలయ కార్యదర్శి దొడ్డా ప్రసాద్,మహిళా ప్రతినిధి మల్లెల ఉషారాణి సింగరేణి ప్యానెల్ న్యాయవాది రమేష్ కుమార్ మక్కడ్,న్యాయవాదులు భాగం మాధవ రావు,పప్పుల ప్రసాద్ కాసాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ