తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం, డిఎస్పి అబ్దుల్ రెహమాన్ కొత్తగూడెం ఆదేశాల మేరకు, ఈరోజు జూలూరుపాడు నందుగల సాధన కాలేజ్ నందు విద్యార్థిని, విద్యార్థులకు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి డ్రగ్స్ నిర్మూలన గురించి వివరించడం జరిగినది. డ్రగ్స్ కు బానిస కావద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ,చెడు నడత గల వారిపై మరియు డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా వ్యక్తుల వద్ద డ్రగ్స్ ఉన్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేసినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ