తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని కావున ప్రతి బిజెపి కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేయాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చింది. కానీ హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని బలహీనపరిచిందని రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని, అదేవిధంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు లో పూర్తిగా విఫలమైందని అన్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వము ఎలాగైతే ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అలాగే చేస్తూ ప్రజలని మోసం చేస్తుందని అన్నారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే జాబు కాలండర్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ నేటికీ అది అమలు కావడం లేదు దీనివల్ల యువత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమైందని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యదర్శి కరణం సాయి పరిణితి మాట్లాడుతూ ప్రతి బిజెపి కార్యకర్త తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వము వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలని అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజా ధర్మా, పొడియం బాలరాజు, కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుణ్యం బిక్షపతి, డాక్టర్ వెంకన్న, భోగి కృష్ణయ్య, ఉపాధ్యక్షులు భూక్య దివ్యశ్రీ, ఎస్ ఐ ఆర్ జిల్లా కన్వీనర్ మోహన్ కృష్ణ, జిల్లా ఆఫీస్ సెక్రటరీ కుమార్ వివిధ మండలాల అధ్యక్షులు ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ