తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం గ్రామం వద్ద ఖమ్మం నుండి కొత్తగూడెం వైపు అతివేగంతో వెళ్తున్న కారు విద్యుత్ స్థంబాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ఎటువంటి ప్రాణహాని జరగలేదు కానీ అతివేగం కారణంగా కారు అదుపు అదుపుతప్పి రోడ్ పక్కన ఉన్న విద్యుత్ స్థంబాన్ని, పక్కనే ఉన్న కిలోమీటర్ మైలు రాయిని ఢీ కొని పల్టీ కొట్టి నిలిచి పోయింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్థంభం విరిగిపోయినది,కారు లో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పగాయలు అయ్యాయి.విద్యుత్ శాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు, సుమారుగా ఐదు గంటల పాటు విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.
Admin
తెలుగు వెలుగు టీవీ