తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని సుఖమయంగా జీవించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.సింగరేణి సంస్థలో 37 ఏళ్లుగా వివిధ అధికార హోదాలో పనిచేసి,ఇటీవల రెస్క్యూ జిఎం గా పదవి విరమణ పొందిన శనగ వెంకటేశ్వర్లు (ఎస్ వి) పదవి విరమణ,అభినందన సభ ఆదివారం సాయంత్రం స్థానిక ప్రకృతి ఆశ్రమంలో నిర్వహించారు.ఈ సభలో సెంట్రల్ వర్క్ షాప్ జీయం దామోదర్ రావు,బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్,ప్రకృతి ఆశ్రమ నిర్వాహకులు సామాజికవేత్త మొక్కల వెంకటయ్య,న్యూక్రా స్కూల్ కరస్పాండెంట్ ఏండి బాసిత్ లు అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా అభినందించారు.శేష జీవితం ఆనందమయంగా గడపాలని కోరారు.సామాజిక సేవలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం విరమణ పొందిన జీఎం ఏస్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..సామాజిక సేవలో నా శేష జీవితాన్ని గడుపుతాను అని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆయనను శాలువాలతో,మొక్కలతో,పూల బొకేలతోఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏజిఎం గోనె శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, మల్లెల రామనాథం, బరగడి దేవదానం, నభి సాహెబ్, ఆశ్రమ నిర్వాహకులు సుగుణ రావు, సాగర్, సైమన్, జంపన్న, డాక్టర్ విజయ్, డాక్టర్ కుమార్, సుమిత్ర దేవి, గండూరి సంజీవ రావు, , రమేష్ బాబు ఆశ్రమ గౌర సభ్యులు వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ