తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్నేహితులతో కలిసి యాత్రకు వెళ్లిన విద్యార్థి గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. వేంసూరు మండలం లచ్చన్నగూడెంకు చెందిన పామర్తి సాయిదినేశ్ ఇటీవల బీటెక్ పూర్తి చేయగా. స్నేహితులతో కలిసి ఏపీలో కోనసీమ జిల్లా వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లాడు. తొలుత ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడ గోదావరి స్నానానికి దిగగా దినేశ్ గల్లంతైనట్లు తెలిసింది. దీంతో రెస్క్యూ టీంలు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు.
Admin
తెలుగు వెలుగు టీవీ