తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత పది సంవత్సరాల నుండి ప్రకృతి వైద్యం ద్వారా పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న హీలర్ జి. సుగుణారావును ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఘనంగా పూలదండలతోసత్కరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్ దాసు నాయక్, గౌరవ అతిధి భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రజా కవి జయరాజు, ప్రముఖ వైద్యులు వాసిరెడ్డి రమేష్ బాబు, వేదిక కన్వీనర్ జేబి శౌరి, నిర్వహణ కమిటీ సభ్యులు మారపాక రమేష్, యెర్ర కామేష్, కూసపాటి శ్రీనివాస్ అతిధులు బిక్కసాని నాగేశ్వరరావు, ధర్మారావు, నాగ సీతారాములు, మండే వీర హనుమంతరావు, మేదర వెంకట ముత్యం, గడ్డం రాజశేఖర్ తదితరుల చేతుల మీదుగా జ్ఞాపికను అందించారు. చిన్నారులు నైనిక రజ్వా , మహమ్మద్ ఆఫాన్ లు మొక్కలను అందించారు. కాగా తొలుత కన్వీనర్ జేబి శౌరి మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రకృతి ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఆల్టర్నేటివ్ తెరపిస్టుగా ఉచితంగా వైద్యాన్ని సామాన్యులకు చేరువ చేయడమే కాకుండా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ఎంపిక చేసామని వెల్లడించారు
Admin
తెలుగు వెలుగు టీవీ