Friday, 17 April 2026 06:35:11 PM
# సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్.

శిశు మరణాలను అరికట్టడం అందరి బాధ్యత – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 12 August 2025 03:39 PM Views : 387

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా పరిధిలో శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ శ్రీ సౌరభ్ శర్మ తో కలిసి శిశు మరణాల పర్యవేక్షణ మరియు ప్రతిస్పందన కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ సంవత్సరం జిల్లాలో నమోదైన 7 శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా వైద్య అధికారులు, వైద్య నిపుణులు, ఫీల్డ్ సిబ్బంది సమగ్ర సమీక్ష నిర్వహించారు. మరణాలకు గల కారణాలను విశ్లేషించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ప్రాణం అమూల్యమని, సమయానికి తీసుకునే జాగ్రత్తలు శిశువుల ప్రాణాలను కాపాడగలవని ఆయన అన్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం వరకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు సమయానికి చేయించుకునేలా గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తరచుగా గర్భిణీల ఇళ్లను సందర్శించాలి. రక్తహీనత నివారణకు పౌష్టికాహారం, అవసరమైన మందులు అందేలా చూడాలి. అంగన్వాడి సిబ్బంది పౌష్టికాహారంపై మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు గర్భిణీల రిజిస్ట్రేషన్, ఆరోగ్య వివరాలను సక్రమంగా నమోదు చేయాలి. హై రిస్క్ గర్భిణీలకు ప్రత్యేక పర్యవేక్షణ, సమయానికి వైద్య సేవలు అందించాలి

గిరిజన మరియు గుత్తికోయల ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా నిమోనియా పై అవగాహన కల్పించేందుకు వారికి అర్థమయ్యే విధంగా వీడియోలు, కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. స్థానిక వెదురు వంటి వనరులను వినియోగించి ఆరోగ్య సంరక్షణకు అనువైన వస్తువులు తయారు చేసే శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిశువులకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు అందించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, దీనిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, విధానాల అమలు మరియు వైద్య సేవలు అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశం అనంతరం జిల్లా వ్యాప్తంగా క్షయవ్యాధి (టీబీ) నివారణ మరియు అవగాహన కోసం రూపొందించిన గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, వైద్య నిపుణులు, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :