Friday, 19 June 2026 05:50:20 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ లకు మున్సిపాలిటీ ద్వారా జీతాలు ఇవ్వాలి

Date : 22 October 2024 04:41 PM Views : 543

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ మున్సిపాల్టీలో విధులు నిర్వర్తిస్తున్న స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ లకు మున్సిపాలిటీ ద్వారా జీతాలు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ లుగా నాలుగున్నర ఏళ్ళుగా విధులు నిర్వర్తిస్తూ జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని,ఏనాయకుడైనా ఎన్నికల ముందు గెలిపిస్తే జీతాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం గెలిచాక ముఖం చాటేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు.కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనులు చేయడం మూలంగా మున్సిపాలిటీకి అవార్డులు వచ్చిన సంగతి మరువొద్దన్నారు.గతంలో మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్ విధులు నిర్వహించిన సమయంలో కార్మికులకు ఇచ్చిన గుర్తింపు కార్డులను అతను బదిలీపై వెళ్ళగానే అట్టి గుర్తింపు కార్డులను సైతం ప్రస్తుత మున్సిపల్ అధికారులు తీసుకొని కార్మికులకు ఇవ్వకుండా వారి వద్ద పెట్టుకున్నారని ఇది సరైంది కాదని కార్మికుల గుర్తింపు కార్డులు కార్మికులకు ఇవ్వాలన్నారు.జిల్లా అధికారులు,స్థానిక ఎంఎల్ఏ వెంటనే స్పందించి స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ లకు జీతాలు ఇవ్వాలని లేనియెడం దశల వారీగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.ఈదీక్షలకు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు,న్యూడెమోక్రసీ నాయకులు నిమ్మల రాంబాబు,కాంగ్రెస్ నాయకులు గద్దెల రమేష్ ఎస్.కె.భాషా,కాపు సంఘం నాయకులు చిన్నంశెట్టి రంగారావులు సంఘీభావం తెలిపారు.ఈకార్యక్రమంలో కాకటీ హుస్సేన్, దద్ధాల కార్తీక్,రాయల పార్వతి,వేముల రమణ,గూగులోత్ సరోజ,కాంపెళ్లి రాము తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :