Wednesday, 27 May 2026 12:11:46 AM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

జూలూరుపాడు లో మేడే పోస్టర్ ఆవిష్కరించిన టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు.

Date : 25 April 2026 07:44 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ ఆధ్వర్యంలో 140వ మే డే ను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మేడే పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ చికాగో పోరాట అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న, ఎన్నో ఉద్యమాలతో కొట్లాడి సాధించుకున్న కార్మిక హక్కులను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మికులను కట్టు బానిసలుగా చేసే ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ వెలుగులోనే కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా అమలు చేస్తుందని అన్నారు చికాగో అమరవీరుల స్ఫూర్తితో మేడే రోజున ఎనిమిది గంటల పని దినం సాధించుకుంటే ఇప్పుడు ఉన్న నరహంతక బిజెపి ప్రభుత్వం 12 గంటల పని విధానం తీసుకురావాలని కుటీల ప్రయత్నాలు చేస్తుందని దీన్ని కార్మిక వర్గం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి, పని గంటల పెంపు, సమ్మె హక్కును కాలరాస్తూ అతి తక్కువ వేతనాలతో కార్మిక వర్గానికి పని లేకుండా చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుందని గోపాలరావు దుయ్యబట్టారు . యూనియన్ పెట్టే హక్కు లేకుండా ప్రశ్నించే హక్కు లేకుండా కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని దీని వెలుగులోనే 140 మే డే ను కార్మిక వర్గం స్ఫూర్తిగా తీసుకొని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, నియంతలా వ్యవహరిస్తున్నమోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం ఒక తాటిపైకి వచ్చి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని గోపాలరావు కోరారు. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం పై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా జరుగు ఆందోళన కార్యక్రమాల్లో కార్మిక వర్గం ముందు వరుసలో ఉండాలని ఈ సందర్భంగా కోరారు. దేశంలో ప్రశాంతమైన వాతావరణంలో కలిసిమెలిసి బతుకుతున్న కార్మిక వర్గంపై ప్రజలపై దేశ ప్రజలను కుల మతాల పేరుతో విభజించి మనుషుల మధ్య తగాదాల సృష్టించి మతాల పేరుతో ప్రజలను విభజించాలనే కుటీల ప్రయత్నాలు చేస్తుందని దీన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు సంఘటితమై వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వారన్నారు. మే డే ను కార్మిక దినోత్సవం గా వాడవాడల కార్మిక వర్గం అంత జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో వినోద్, నాగేష్,మధు కనకమ్మ, అరుణ, లలిత, చందు, నాగయ్య, శ్రేదేవి, నరేష్, పద్మ భవానీ, నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :