తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ ఒకటి తెలుగు వెలుగు) : ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీతో కూరగాయల విత్తనం పంపిణీ చేయడం జరిగింది. ఈవిత్తనాలు సాగు చేయడం సేంద్రియ ఎరువులను ఉపయోగించుకొని ప్రతి ఒక్క ఇంటిలో వారికి ఉన్న ఖాళీ స్థలంలో గాని వ్యవసాయ స్థలంలో గాని రసాయనిక ఎరువులు ఉపయోగించుకోకుండా పూర్తి సేంద్రియ ఎరువులతో మాత్రమే కూరగాయల పండించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పడమటి నరసాపురం గ్రామపంచాయతీలో కూరగాయల విత్తనాల పంపిణీ ఉచితంగా హెచ్ ఈ ఓ వసంత ఆధ్వర్యంలో స్థానిక ముఖ్య అతిథిగా గౌరవ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి గ్రామపంచాయతీ సెక్రటరీ ధరమ్ సోత్ హారిక గ్రామ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్క రైతులకు ఉచితంగా కూరగాయలు విత్తనం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మండల హెచ్ఈఓ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు విత్తనాలు తీసుకొని వారికున్న స్థలాల్లో కూరగాయలు సాగు చేసి ఖర్చులను తగ్గించుకోవాలని సూచనప్రాయంగా తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ